JD Chakravarthi: ఇప్పుడు పవన్ కల్యాణ్ కు ఏం జరిగిందో అప్పుడు చిరంజీవికి కూడా అదే జరిగింది: జేడీ చక్రవర్తి

షార్ట్స్‌లో చూడండి
జనసేనాని పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానంపై ప్రముఖ నటుడు, దర్శకుడు జేడీ చక్రవర్తి తన అభిప్రాయాలు వెల్లడించారు. ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జేడీ చక్రవర్తి మాట్లాడుతూ, సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వెళ్లకూడదన్న నిబంధన ఏదీ లేదన్నారు. వాస్తవానికి పవన్ ఎంతో సున్నితమైన వ్యక్తి అని చెప్పారు. ఆయనలో భావోద్వేగాలు మెండుగా ఉంటాయని, ఈ విషయం ప్రజలకు తెలియడానికి మరికొంత సమయం పడుతుందని అన్నారు.

పవన్ పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత తానేంటో ప్రజలకు వివరించడానికి ఆయనకు పెద్దగా సమయం సరిపోలేదని, మరో ఐదేళ్లలో పవన్ సిద్ధాంతాలను ప్రజలు మరింతగా అర్థం చేసుకుంటారని చక్రవర్తి అభిప్రాయపడ్డారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ కు ఎదురైన పరిస్థితే, అప్పట్లో చిరంజీవి కూడా ఎదుర్కొన్నారని తెలిపారు. ఉన్న కొద్ది వ్యవధిలో ప్రజలు వాళ్ల అంతరంగాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోయారని వివరించారు. 
Go Back to Shorts
JD Chakravarthi
Pawan Kalyan
Chiranjeevi

More Telugu News