JD Chakravarthi: మహేశ్వరిని మేమిద్దరం ప్రేమించాం... ఇద్దరినీ ఆమె సోదరభావంతోనే చూసింది: జేడీ చక్రవర్తి

  • కృష్ణవంశీకి, తనకు మధ్య వివాదంపై జేడీ వివరణ
  • కొంతకాలంపాటు ఇద్దరం మాట్లాడుకోలేదు
  • నా పెళ్లికి వర్మే కారణం
ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి ఓ టీవీ చానల్ ముఖాముఖిలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. గులాబి చిత్రం షూటింగ్ సమయంలో హీరోయిన్ మహేశ్వరి కోసం దర్శకుడు కృష్ణవంశీతో గొడవపడడంపై వివరణ ఇచ్చాడు. ఆ సమయంలో మహేశ్వరిని తామిద్దరం ప్రేమించామని, కానీ ఆమె తమలో ఎవరినీ ప్రేమించకపోగా, ఇద్దరినీ సోదరులుగా భావించిందని వెల్లడించారు. మహేశ్వరి తమతో స్నేహభావంతోనే ఉన్నా తామే అపోహపడ్డామని తెలిపారు.

అయితే, అప్పటి స్పర్ధ తనకు, కృష్ణవంశీకి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ కు కారణమైందని, కొంతకాలంపాటు ఇద్దరం మాట్లాడుకోలేదని తెలిపారు. అయితే, ఇప్పుడా గొడవలేవీ లేవని జేడీ చక్రవర్తి స్పష్టం చేశారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వద్ద అసిస్టెంట్లుగా పనిచేసినప్పటి నుంచి కృష్ణవంశీ, జేడీ చక్రవర్తి మంచి మిత్రులు. అయితే మహేశ్వరి ఎపిసోడ్ ఇద్దరి మధ్య అగాధాన్ని సృష్టించింది. ఇక, తాను లైఫ్ లో పెళ్లి చేసుకుని సెటిలవడానికి ప్రధాన కారకుడు రామ్ గోపాల్ వర్మేనని జేడీ చక్రవర్తి చెప్పారు. అన్ని విధాలుగా తనకు వర్మ స్ఫూర్తి ప్రదాత అని, అలాంటి వ్యక్తి ఒకరోజు, జేడీ నువ్వు పెళ్లి చేసుకుంటేనే బాగుంటుందని చెప్పడంతో పెళ్లి ఆలోచన చేశానని పేర్కొన్నాడు.
JD Chakravarthi

More Telugu News