sameer: రాజీపడటమనేది రాజమౌళికి తెలియదు: నటుడు సమీర్

  • రాజమౌళి సీరియల్లో చేశాను
  •  ఆయన ఆలోచనా విధానం కొత్తగా ఉండేది
  • సాధించేవరకూ ప్రయత్నిస్తూనే వుంటారు
బుల్లితెరపై ఎన్నో ధారావాహికల్లో నటించి మెప్పించిన సమీర్, ఆ తరువాత వెండితెరపైనే ఎక్కువ దృష్టి పెట్టాడు. సినిమాల్లో విభిన్నమైన పాత్రలను చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన రాజమౌళిని గురించి ప్రస్తావించాడు.

"రాజమౌళి గారు దర్శకత్వం వహించిన 'శాంతినివాసం' సీరియల్లో నేను చేశాను. కొన్ని వందల ఎపిసోడ్లకి కలిసి పనిచేయడం వలన ఆయనతో నాకు చనువు వుంది. మొదటి నుంచి కూడా ఆయన ఆలోచనా విధానం కొత్తగా ఉండేది. అందువలన భవిష్యత్తులో ఆయన గొప్ప దర్శకుడు అవుతాడని అనుకున్నాను గానీ, ఈ రేంజ్ ను మాత్రం ఊహించలేదు. రాజమౌళి మంచి నటుడు .. ప్రతి సీన్ చేసి చూపిస్తారు. ఏ విషయంలోనైనా రాజీపడటమనేది ఆయనకి తెలియదు. ఏదైతే అనుకున్నారో అది సాధించేంతవరకూ ప్రయత్నిస్తూనే వుంటారు" అని చెప్పుకొచ్చాడు. 
sameer

More Telugu News