Kesineni Nani: దేవినేని ఉమాకి కొడాలి జీవితాంతం కృతజ్ఞుడిగా ఉండాలి: కేశినేని నాని

  • ఫేస్ బుక్ లో కేశినేని నాని వ్యంగ్య పోస్ట్
  • నాడు టీడీపీలో ఉన్న వేళ కొడాలి, దేవినేని మధ్య విభేదాలు
  • ఆపై వైసీపీలో చేరి, నేడు మంత్రిగా ఉన్న కొడాలి
విజయవాడ ఎంపీ కేశినేని నాని తన ఫేస్ బుక్ లో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు కొత్త చర్చకు దారితీసి కలకలం రేపుతోంది. తాను మంత్రి అవ్వడానికి కారణమైన దేవినేని ఉమకు, కొడాలి నాని జీవితాంతం కృతజ్ఞతగా ఉండాలని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు కేశినేని నాని. నాడు టీడీపీలో ఉన్నవేళ కొడాలి నాని, దేవినేని ఉమల మధ్య విభేదాలు ఉండేవన్న సంగతి తెలిసిందే.

 అప్పట్లో దేవినేనిపై సంచలన ఆరోపణలు చేసిన నాని, ఆపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆపై అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి, ఇప్పుడు జగన్ క్యాబినెట్ లో మంత్రిగా స్థానం సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో కొడాలి నానిని ఉద్దేశించి, ఉమను ప్రస్తావిస్తూ కేశినేని ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.
Kesineni Nani
Kodali Nani
Devineni Uma

More Telugu News