Twitter: లోక్ సభలో ఏ సమస్య గురించి మాట్లాడాలో చెప్పాలంటూ ప్రజలను కోరిన టీడీపీ ఎంపీ!

  • మరో వారంలో పార్లమెంట్ సమావేశాలు
  • సమస్యలు చెబితే లోక్ సభలో ప్రస్తావిస్తా
  • ట్విట్టర్ లో వెల్లడించిన రామ్మోహన్ నాయుడు
మరో వారంలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండగా, సభలో తాను ఏఏ అంశాలను ప్రస్తావించాలో, ఏ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలో చెప్పాలని శ్రీకాకుళం లోక్‌ సభ సభ్యుడు కింజరాపు రామ్మోహన్‌ నాయుడు కోరారు. ఓ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన ఆయన, ఏదైనా ప్రత్యేక సమస్య ఉండి, తాను లోక్ సభలో లేవనెత్తడం ద్వారా కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని అనుకుంటే తనకు తెలియజేయాలని స్నేహితులు, ప్రజలకు రామ్మోహన్ నాయుడు సూచించారు. ఇందుకోసం రెండు హ్యాష్ ట్యాగ్ లను క్రియేట్ చేశానని, '#AskRam' లేదా '#RamSpeaks'ల ద్వారా తమ సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆయన తన ట్విట్టర్ ద్వారా కోరారు.
Twitter
Telugudesam
Rammohan Nayudu

More Telugu News