Jagan: కేసీఆర్ కన్నా జగనే బెటర్: మంద కృష్ణ

  • ఏ అనుభవమూ లేని జగన్ మెరుగ్గా పని చేస్తున్నారు
  • అన్ని సామాజిక వర్గాలకూ న్యాయం చేశారు
  • క్యాబినెట్ లో మహిళలకు పెద్దపీట వేశారన్న మంద కృష్ణ
రాజకీయాల్లో అపారమైన అనుభవముందని చెప్పుకొనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కన్నా, ఎలాంటి అనుభవమూ లేని జగన్‌, ఆంధ్రప్రదేశ్ లో మెరుగ్గా పని చేస్తున్నారని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా నందిగామకు వచ్చిన ఆయన, మీడియాతో మాట్లాడుతూ, అన్ని సామాజిక వర్గాలనూ జగన్ తన క్యాబినెట్ లోకి తీసుకోవడంపై హర్షం వ్యక్తంచేశారు.

 క్యాబినెట్ లోకి ముగ్గురు మహిళలను తీసుకున్నారని, అత్యంత కీలకమైన హోమ్ శాఖకు ఓ మహిళను ఎంపిక చేసుకున్నారని గుర్తు చేసిన ఆయన, తన చర్యలతో అన్ని వర్గాల ప్రజల అభిమానాన్ని జగన్ చూరగొంటున్నారని అన్నారు. కేసీఆర్ మంత్రివర్గంలో ఒక్క మహిళ కూడా లేదని, మహిళలపై కేసీఆర్ కు చిన్నచూపనడానికి ఇంతకన్నా నిదర్శనం లేదని అన్నారు. కేసీఆర్ క్యాబినెట్ లో ఒక్కరే దళితునికి స్థానం లభిస్తే, జగన్ ఏకంగా ఐదుగురు దళిత ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారని పొగడ్తలు కురిపించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం జరిగే పోరాటాలకు తాను మద్దతిస్తానని చెప్పారు.
Jagan
KCR
Manda Krishna
Cabinet

More Telugu News