Mallu Bhatti Vikramarka: భట్టి ఆమరణ దీక్ష భగ్నం... అరెస్ట్ చేసి ఆసుపత్రికి తరలించిన పోలీసులు!

  • మూడు రోజులుగా నిరాహార దీక్ష
  • ఆరోగ్యం విషమించిందని వైద్యుల నివేదిక
  • బలవంతంగా నిమ్స్ కు తరలించిన పోలీసులు
పార్టీ ఫిరాయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిబంధనలకు విరుద్ధంగా టీఆర్ఎస్ కలిపేసుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆరోపిస్తూ, భట్టి విక్రమార్క తలపెట్టిన ఆమరణ దీక్షను పోలీసులు ఈ తెల్లవారుజామున భగ్నం చేశారు. గడచిన మూడు రోజులుగా, హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద దీక్షలో ఉన్న ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని వైద్యులు నివేదిక ఇవ్వడంతో, భారీ ఎత్తున తరలివచ్చిన పోలీసులు, అక్కడున్న కాంగ్రెస్ శ్రేణులను చెదరగొట్టి, భట్టిని అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఆపై ఆయన్ను పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాగా, తాను దీక్షను విరమించబోనని, ఆసుపత్రిలోనే దీక్షను కొనసాగిస్తానని ఈ సందర్భంగా భట్టి వ్యాఖ్యానించారు.
Mallu Bhatti Vikramarka
Hunger Strike
Hyderabad
Police

More Telugu News