London: లండన్‌లో భారీ అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన 20 ఫ్లాట్లు

  • తూర్పు లండన్‌లోని  డీపాస్ గార్డెన్స్ సమీపంలో ఘటన
  • రెండు గంటలపాటు శ్రమించిన వందమంది ఫైర్ సిబ్బంది
  • ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్న పోలీసులు
లండన్‌లోని డీపాస్ గార్డెన్స్ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ అపార్ట్‌మెంటులో చెలరేగిన మంటలు ఆరు అంతస్తుల వరకు వ్యాపించాయి. అపార్ట్‌మెంట్‌లోని 20 ఫ్లాట్లు పూర్తిగా దగ్ధం కాగా, మరో పది ఫ్లాట్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న 100 మంది అగ్నిమాపక సిబ్బంది 15 అగ్నిమాపక శకటాలతో రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు.

తొలుత ఫ్లాట్లలో చిక్కుకున్న వారిని, ఆ చుట్టుపక్కల ఉన్నవారిని  రక్షించి దూరంగా తరలించారు. ఆ మార్గాన్ని మూసివేశారు. ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు తీస్తున్నారు.
London
Fire Accident
De Pass Gardens

More Telugu News