Jagan: పాదాభివందనం చేసేందుకు జగన్ ప్రయత్నాలు... వద్దని వారించిన మోదీ!

  • రేణిగుంట విచ్చేసిన పీఎం
  • స్వాగతం పలికిన ఏపీ సీఎం జగన్
  • ఎయిర్ పోర్టులో ఆసక్తికర సన్నివేశం
రేణిగుంట విమానాశ్రయంలో ఇవాళ సాయంత్రం ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ముగించుకుని తిరుమల శ్రీవారి దర్శనం కోసం రేణిగుంట చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ ప్రధానికి స్వాగతం పలకడానికి వచ్చారు. మోదీ విమానం నుంచి కిందికి రాగానే ఆయనకు పుష్పగుచ్ఛం అందించి పాదాభివందనం చేసేందుకు ప్రయత్నించారు. అయితే మోదీ వద్దని వారించారు.

మర్యాదపూర్వక పలకరింపుల సందర్భంగా హడావుడిగా మరోసారి మోదీకి పాదాభివందనం చేసేందుకు జగన్ విఫలయత్నం చేశారు. జగన్ ను కాళ్లకు నమస్కారం చేయనివ్వకుండానే మోదీ ముందుకు కదిలారు. దాంతో, జగన్ చేసేది లేక నవ్వుతూ తన పార్టీ ముఖ్యనేతలను ప్రధానికి పరిచయం చేస్తూ స్వాగత కార్యక్రమాన్ని పూర్తి చేశారు.

Jagan
Narendra Modi

More Telugu News