Rammohan Naidu: భార్యతో కలిసి భారత్ - ఆస్ట్రేలియా మ్యాచ్‌లో సందడి చేస్తున్న ఏపీ ఎంపీ

  • మ్యాచ్‌ను నేరుగా వీక్షిస్తున్న రామ్మోహన్ నాయుడు
  • ఫోటోలను అభిమానులతో పంచుకున్న ఎంపీ
  • టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెబుతూ పోస్ట్
భారత్ - పాక్ మ్యాచ్ తరువాత క్రికెట్ ప్రేమికులు భారత్- ఆస్ట్రేలియా మ్యాచ్‌ను అమితంగా ఇష్టపడతారు. ప్రపంచకప్‌లో భాగంగా నేడు భారత్ - ఆస్ట్రేలియాల మధ్య మ్యాచ్‌ ఇంగ్లండ్‌లోని ఓవల్ మైదానంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు సందడి చేస్తున్నారు.

టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు తన భార్య శ్రావ్యతో కలిసి మ్యాచ్‌ను నేరుగా వీక్షిస్తున్నారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలను సామాజిక మాధ్యమాల ద్వారా ఆయన అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా టీమిండియాకు ఆల్‌ ది బెస్ట్ చెబుతూ పోస్ట్ పెట్టారు. మరో వైపు ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న మహేశ్ బాబు కూడా తన కుటుంబంతో కలిసి మ్యాచ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు.
Rammohan Naidu
Sravya
Mahesh Babu
Social Media
India
Australia

More Telugu News