Andhra Pradesh: ఏపీ సచివాలయంలో కొత్త మంత్రులకు ఛాంబర్ల ఏర్పాటుపై దృష్టి!

  • పురపాలక శాఖ పేషీని పరిశీలించిన బొత్స
  • మార్పులు చేర్పులపై అధికారులకు పలు సూచనలు  
  • విద్యా శాఖ పేషీని తీసుకునే ఆలోచనలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి
ఏపీ సచివాలయంలో కొత్త మంత్రులకు ఛాంబర్ల ఏర్పాటుపై సాధారణ పరిపాలన శాఖ దృష్టి సారించింది. సచివాలయంలో ఛాంబర్లను మంత్రులు పరిశీలించి వెళ్తున్నారు. రెండో బ్లాక్ లో పురపాలక శాఖ పేషీని మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పరిశీలించారు. పేషీకి అవసరమైన మార్పులు చేర్పులపై సంబంధిత అధికారులకు బొత్స పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పురపాలక శాఖ కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఆయన పరిశీలించారు. దేవాదాయ శాఖ, విద్యా శాఖ మంత్రుల పేషీలను ఆయా శాఖల మంత్రుల అనుచరులు పరిశీలించి వెళ్లినట్టు సమాచారం. విద్యా శాఖ పేషీని తీసుకోవాలనే ఆలోచనలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నట్టు తెలుస్తోంది.
Andhra Pradesh
secretariat
minister
botsa

More Telugu News