West Godavari District: పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మిస్తాం: మంత్రి శ్రీరంగనాథరాజు

  • తక్కువ వడ్డీ రేట్లకే హౌసింగ్ లోన్లు ఇప్పిస్తాం
  • గృహనిర్మాణ శాఖ అంటే నాకు ఎంతో ఇష్టం
  • ఈ శాఖను నాకు అప్పగించిన సీఎంకు ధన్యవాదాలు
ఏపీలోని పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మహిళల పేరు మీదే పట్టాలు ఇస్తామని, తక్కువ వడ్డీ రేట్లకే హౌసింగ్ లోన్లు ఇప్పిస్తామని చెప్పారు. గృహనిర్మాణ శాఖ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఈ శాఖను తనకు అప్పగించిన సీఎం జగన్ కు తన కృతఙ్ఞతలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా గతంలో అత్తిలి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆ నియోజకవర్గంలో మూడు వందల ఎకరాల్లో మూడు వేల మందికి పైగా ఇళ్లు కట్టించిన విషయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. నాడు తాను చేసిన ఈ అభివృద్ధిని చూసే తనకు ఈ శాఖను జగన్ అప్పగించారని అనుకుంటున్నానని అన్నారు.
West Godavari District
Tadepalliguden
sriranganath raj

More Telugu News