Vijayawada: విజయవాడలో గంజాయి అమ్మకాల్లో బయటపడ్డ కొత్త కోణం!

  • గంజాయి విక్రయిస్తున్న వారిలో బీటెక్ విద్యార్థులు
  • అరకు నుంచి గంజాయి కొనుగోలు 
  • విజయవాడలోని ఐదు కాలేజీల్లో ఇదే పరిస్థితి
గంజాయి అమ్మకాల్లో కొత్తకోణం బయటపడుతోంది. విజయవాడలో గంజాయి విక్రయిస్తున్న వారిలో బీటెక్ విద్యార్థులు ఉన్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. గంజాయి విక్రయిస్తున్న పది మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకోగా, అందులో ఆరుగురు యువకులు బీటెక్ చదువుతున్నట్టు సమాచారం. విశాఖపట్టణం జిల్లా అరకు నుంచి గంజాయి కొనుగోలు చేసి విజయవాడకు తీసుకొచ్చి ఇక్కడి కాలేజీ విద్యార్థులకు పట్టుబడ్డ యువకులు విక్రయిస్తున్నారు. విజయవాడలోని దాదాపు ఐదు కాలేజీల్లో ఇదే పరిస్థితి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
Vijayawada
Btech students
Ganja
aarak

More Telugu News