Uttar Pradesh: సీఎం యోగిపై జర్నలిస్టు అభ్యంతరకర పోస్టు.. అరెస్ట్

  • సీఎం యోగికి పెళ్లి ప్రతిపాదన పంపినట్టు పేర్కొన్న మహిళ
  • వీడియోను పోస్టు చేసిన జర్నలిస్ట్
  • యోగి ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నం జరుగుతోందని ఫిర్యాదు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై ఫేస్‌బుక్‌లో అనుచిత పోస్టు చేసిన ఢిల్లీకి చెందిన జర్నలిస్ట్‌ ప్రశాంత్ కనోజియాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆయనను అరెస్ట్ చేయలేదని తర్వాత పోలీసులు స్పష్టం చేశారు.

యోగి ఆదిత్యనాథ్ కార్యాలయం బయట ఓ మహిళ విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు తాను పెళ్లి ప్రతిపాదన పంపినట్టు పేర్కొంది. ఈ వీడియోను కనోజియా తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేశారు. వీడియో కాస్తా వైరల్ అవడంతో లక్నోకు చెందిన ఓ పోలీసు అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ముఖ్యమంత్రి ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని అందులో ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నట్టు తొలుత వార్తలు వచ్చాయి.  అయితే, అటువంటిదేమీ లేదని, కనోజియా కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
Uttar Pradesh
Lucknow
yogi adityanath

More Telugu News