Narendra Modi: రేపు తిరుమలకు మోదీ.. స్వాగతం చెప్పనున్న జగన్

  • శ్రీలంక నుంచి రేణిగుంట చేరుకోనున్న మోదీ
  •  కార్యకర్తలతో మోదీ సమావేశం 
  • ప్రధానితో కలసి శ్రీవారి దర్శనానికి సీఎం 
ఏపీ సీఎం జగన్ రేపు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి తిరుమల వస్తున్నారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న మోదీ రేపు శ్రీలంక నుంచి రేణిగుంట చేరుకుంటారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ సీఎం హోదాలో జగన్ స్వాగతం పలుకుతారు. అనంతరం మోదీ బీజేపీ కార్యకర్తలతో సమావేశంలో పాల్గొంటారు. ఆపై సాయంత్రం ఆరింటికి మోదీ, జగన్ శ్రీవారి దర్శనం చేసుకుంటారు. రాత్రి 8 గంటల 15 నిమిషాలకు ప్రధాని మోదీ హస్తిన పయనం అవుతారు. కాగా, ఏపీ సీఎం జగన్ ఇవాళ తన క్యాబినెట్ ప్రమాణస్వీకారంతో బిజీగా గడిపారు. కొత్త క్యాబినెట్ తో సరికొత్తగా పాలన మొదలుపెట్టనున్న ఆయన తిరుమల శ్రీవారి ఆశీస్సులు అందుకోనున్నారు.
Narendra Modi
Jagan

More Telugu News