KTR: వాళ్లు చేస్తే ఒప్పు.. మేం చేస్తే తప్పా?: కేటీఆర్

  • మా ఎంపీకి రాహుల్ కండువా కప్పలేదా?
  • మా ఎమ్మెల్సీలను కాంగ్రెస్‌లో చేర్చుకోలేదా?
  • కాంగ్రెస్ వికృత కార్యకలాపాలు చాలా ఉన్నాయి
  • ఎమ్మెల్యేల విలీనం రాజ్యాంగ విరుద్ధం కాదు

 తమ పార్టీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల విలీనంపై తమను విమర్శిస్తున్న కాంగ్రెస్ నేతలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడుతూ, ప్రశ్నల వర్షం కురిపించారు. ‘ఎన్నికలకు ముందు మా ఎంపీకి రాహుల్ కండువా కప్పలేదా? మా ఎమ్మెల్సీలను కాంగ్రెస్‌లో చేర్చుకోలేదా? గతంలో పార్టీలను కాంగ్రెస్‌లో విలీనం చేసుకోలేదా? వాళ్లు చేస్తే ఒప్పు, మేం చేస్తే తప్పా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు.

ప్రజాస్వామ్యం గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడితే, దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందన్నారు. కాంగ్రెస్ వికృత కార్యకలాపాలు తెలంగాణలో చాలానే ఉన్నాయని కేటీఆర్ విమర్శించారు. ఎమ్మెల్యేల విలీనం రాజ్యాంగ విరుద్ధం కాదని, కాంగ్రెస్ నేతలు ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు. 

More Telugu News