peddireddy ramachandra reddy: ప్రమాణస్వీకారం చేస్తూ కంటతడి పెట్టిన పెద్దిరెడ్డి

  • పెద్దిరెడ్డికి పంచాయతీరాజ్, గనులు, గ్రామీణాభివృద్ధి శాఖలు
  • పెద్దాయన పట్ల గౌరవాన్ని చాటుకున్న జగన్
  • ప్రమాణస్వీకారం సందర్భంగా భావోద్వేగానికి గురైన పెద్దిరెడ్డి
ప్రమాణస్వీకారం సందర్భంగా వైసీపీ సీనియర్ నేత పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. గవర్నర్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయిస్తున్నప్పుడు భావోద్వేగాన్ని తట్టుకోలేక కంటతడి పెట్టుకున్నారు. వైసీపీ ఆవిర్భవించినప్పటి నుంచి పార్టీకి పెద్దదిక్కుగా పెద్దిరెడ్డి పార్టీలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించారు. వైసీపీ గెలుపొందినప్పటి నుంచి ఆయనకు మంత్రి పదవి ఖాయమనే ప్రచారం కూడా జరిగింది. అనుకున్నట్టుగానే ఆయనకు మంత్రి పదవిని కట్టబెట్టి... ఆయన పట్ల తనకున్న గౌరవాన్ని ముఖ్యమంత్రి జగన్ చాటుకున్నారు. కేబినెట్లో ఆయనకు పంచాయతీరాజ్, గనులు, గ్రామీణాభివృద్ధి శాఖలను కట్టబెట్టారు.
peddireddy ramachandra reddy
ysrcp
jagan

More Telugu News