kcr: టీఆర్ఎస్ కు తిరుగులేదనే విషయాన్ని ఈ ఫలితాలు మరోసారి చాటాయి: కేసీఆర్

  • స్థానిక ఎన్నికల్లో గెలుపొందినవారికి శుభాకాంక్షలు 
  • ఇది ప్రజావిజయం
  • కార్యకర్తలకు, ఓటర్లకు ధన్యవాదాలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ జయకేతనం ఎగురవేసింది. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, జెడ్పీ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు తదితరులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి కృషి చేసిన పార్టీ కార్యకర్తలకు, ఓటర్లకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇది ప్రజావిజయమని అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదనే విషయాన్ని ఈ ఫలితాలు మరోసారి చాటాయని చెప్పారు.
kcr
TRS
localbody elections

More Telugu News