owaisi: రెండో పెద్ద పార్టీ మాదే.. ప్రతిపక్షహోదా ఇవ్వండి: అసదుద్దీన్ ఒవైసీ

  • కాంగ్రెస్ కంటే మాకే ఎక్కువ ఎమ్మెల్యేలు ఉన్నారు
  • త్వరలోనే స్పీకర్ ను కలుస్తాం
  • ఆయన సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాం
టీఆర్ఎస్ లో సీఎల్పీ విలీనం నేపథ్యంలో, తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడిపోయింది. ఈ నేపథ్యంలో, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా ఎంఐఎం ఉందని... ఈ నేపథ్యంలో, తమకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను ఇవ్వాలని స్పీకర్ ను కోరుతున్నామని తెలిపారు. కాంగ్రెస్ కంటే తమకే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పారు. తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలసి స్పీకర్ ను కలుస్తామని... ఆయన సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామని తెలిపారు.
owaisi
mim
opposition

More Telugu News