Rahul Gandhi: వయనాడ్ లోని ప్రతీఒక్కరికీ నా ఇంటి తలుపులు తెరిచి ఉంటాయి!: రాహుల్ గాంధీ

షార్ట్స్‌లో చూడండి
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈరోజు కూడా వయనాడ్ లో పర్యటించారు. సార్వత్రిక ఎన్నికల్లో అమేథీ నుంచి ఓడిపోయిన రాహుల్.. వయనాడ్ నుంచి 4.31 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. ఈ నేపథ్యంలో రాహుల్ నేడు కూడా వయనాడ్ లోని కాల్పెట్టలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనను భారీ మెజారిటీతో గెలిపించిన వయనాడ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

‘వయనాడ్ లోని ప్రతీఒక్కరికీ నా ఇంటి తలుపులు తెరిచి ఉంటాయి. సిద్ధాంతాలకు అతీతంగా, ప్రాంతాలు, పార్టీలతో సంబంధం లేకుండా నేను అందరికీ అందుబాటులో ఉంటాను. కేరళలోని వయనాడ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో వయనాడ్ తో పాటు రాష్ట్ర సమస్యలను కూడా లోక్ సభ లో ప్రస్తావిస్తాను’ అని రాహుల్ గాంధీ చెప్పారు.
Go Back to Shorts
Rahul Gandhi
Congress
vayanad

More Telugu News