Andhra Pradesh: మరికొందరు మంత్రుల ప్రమాణ స్వీకారం

  • కొనసాగుతున్న ఏపీ కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం
  • కొడాలి నాని, పేర్ని నాని తదితరుల ప్రమాణం
  • అంతకు ముందు పినిపే విశ్వరూప్, ఆళ్ల నాని 
ఏపీ కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం కొనసాగుతోంది. కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (కొడాలి నాని) మంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారు. గవర్నర్ నరసింహన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. కొడాలి నాని తర్వాత పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, మేకతోటి సుచరిత తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు పినిపే విశ్వరూప్, ఆళ్ల నాని, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, తానేటి వనిత ప్రమాణ స్వీకారం చేశారు. 
Andhra Pradesh
mla
minister
Kodali Nani

More Telugu News