secrriteriat: ఉద్యోగులు అలా ఉండడం సహజం... దాన్ని తప్పుపట్టను : ముఖ్యమంత్రి జగన్‌

  • సమస్యల పరిష్కారం కోసం సీఎంతో సన్నిహితంగా ఉంటారు
  • ఏ ప్రభుత్వంలోనైనా అది సర్వసాధారణం
  • మా ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించండి
సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యమంత్రులతో సన్నిహితంగా ఉండడం సహజమని, దీన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఈరోజు ఉదయం సచివాలయంలోకి అడుగుపెట్టిన జగన్‌ సచివాలయంలోని గ్రీవెన్‌ హాల్‌లో విభాగాధిపతులు, సీనియర్‌ అధికారులతో సమావేశం అయిన అనంతరం ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఏ ప్రభుత్వంలోనైనా సీఎంతో సన్నిహితంగా ఉండాలని ఉద్యోగులు కోరుకుంటారన్నారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబుతో సన్నిహితంగా ఉన్న వారినీ తాను తప్పుపట్టనని చెప్పారు. 'మా ప్రభుత్వంలో చిత్తశుద్ధితో సేవలందించి ప్రభుత్వ లక్ష్యాల సాధనకు మీ వంతు సహకారం అందించాలని' కోరారు. సచివాలయంలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు.
secrriteriat
employees
CM jagan

More Telugu News