Andhra Pradesh: జగన్ ఛాంబర్ గోడలపై ‘నవరత్నాలు’.. ప్రశంసలు కురిపిస్తున్న అభిమానులు, మద్దతుదారులు!

  • ఈరోజు తన ఛాంబర్ లో కి వెళ్లిన సీఎం జగన్
  • ఆశీర్వదించిన వేద పండితులు
  • గోడలపై నవరత్నాల వివరాలతో కూడిన ఛాయా చిత్రాలను అలంకరించిన అధికారులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు సచివాలయంలోని తన కార్యాలయంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సచివాలయంలోని మొదటి బ్లాక్ లోకి ప్రవేశించిన జగన్ కు వేదపండితులు మంత్రోచ్చారణలతో స్వాగతం పలికారు. కాగా, జగన్ ఛాంబర్ లో ఆసక్తికరమైన దృశ్యాలు కనిపించాయి. ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన నవరత్నాలను అందమైన చిత్రాలుగా మలిచి జగన్ ఛాంబర్ లో గోడలకు అంటించారు.
పక్కనే దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి నిలువెత్తు చిత్రపటాన్ని ఉంచారు. కాగా, ప్రతీక్షణం ఎన్నికల హామీలను గుర్తించుకుని పనిచేయడానికే జగన్ ఇలా నవరత్నాలను తన ఛాంబర్ గోడలపై ఉంచారని ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


Andhra Pradesh
YSRCP
Jagan
Chief Minister
navaratnalau

More Telugu News