Telangana: మత్స్య శాఖ అధికారులకు కేటీఆర్ అభినందనలు

  • చేపల ఉత్పత్తిలో 3 లక్షల టన్నుల మైలురాయి దాటాం
  • ప్రభుత్వం వల్లే ఇది సాధ్యమైంది
  • కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులు వెన్నెముకగా నిలవనున్నాయి
తెలంగాణ మత్స్య శాఖ అధికారులకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు తెలిపారు. చేపల ఉత్పత్తిలో మూడు లక్షల టన్నుల మైలురాయి దాటడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపట్టిన చేపపిల్లల పంపిణీ, మార్కెటింగ్ సదుపాయం వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. మత్స్య శాఖ అధికారులు, చేపల పెంపకం దారులకు అభినందనలు తెలియజేశారు. చేపల ఉత్పత్తి రంగానికి కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులు వెన్నెముకగా నిలవనున్నాయని అన్నారు.
Telangana
TRS
KTR
fisheries

More Telugu News