Andhra Pradesh: జగన్ మోడల్ కేబినెట్ ను ఏర్పాటు చేశారు.. ఐదుగురు డిప్యూటీ సీఎంలు వినూత్న ప్రయోగం!: విజయసాయిరెడ్డి

  • జగన్ సామాజిక సమతుల్యతకు పెద్దపీట వేశారు
  • మంత్రులంతా సీఎం ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి
  • ట్విట్టర్ లో స్పందించిన వైసీపీ నేత
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మంత్రివర్గం కూర్పు విషయంలో సామాజిక సమతుల్యతకు పెద్దపీట వేశారని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తెలిపారు. అందులో భాగంగానే జగన్ మోడల్ కేబినెట్ ను ఏర్పాటు చేశారని వ్యాఖ్యానించారు. ఒకేసారి ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమించడం అనేది ఓ వినూత్న ప్రయోగమని అభిప్రాయపడ్డారు. అస్తవ్యస్తంగా మారిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి మంత్రులంతా ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు.

ఈరోజు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందిస్తూ..‘మంత్రివర్గం కూర్పులో సామాజిక సమతుల్యతకు పెద్ద పీట వేస్తూ సీఎం జగన్‌ గారు దేశంలోనే ఒక మోడల్‌ కేబినెట్‌ను ఏర్పాటు చేశారు. ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఒక వినూత్న ప్రయోగమనే చెప్పాలి. అస్తవ్యస్తమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి మంత్రులంతా ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా శ్రమించాలి’ అని ట్వీట్ చేశారు.
Andhra Pradesh
Jagan
Chief Minister
Vijay Sai Reddy
Twitter

More Telugu News