వయనాడ్లో రాహుల్ రోడ్ షో.. భారీ వర్షంలోనూ పోటెత్తిన జనం!
- తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన రాహుల్
- బీజేపీ చిమ్ముతున్న విద్వేషాన్ని ప్రేమతో ఎదుర్కొంటానన్న కాంగ్రెస్ చీఫ్
- పార్లమెంటులో వయనాడ్ గొంతుకనవుతానన్న రాహుల్
వాన జోరుగా కురుస్తున్నా ప్రజలు లెక్కచేయలేదు. రోడ్డుకు ఇరువైపులా నిల్చుని రాహుల్కు ఘన స్వాగతం పలికారు. కలికావు మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో పోలీసులు రాహుల్కు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. తనపై ఇంతటి అభిమానం చూపుతున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. వయనాడ్ ప్రజల తరపున పార్లమెంటులో తన వాణిని వినిపిస్తానన్నారు. బీజేపీ చిమ్ముతున్న విద్వేషాన్ని, అసహనాన్ని ప్రేమ, ఆప్యాయతలతో ఎదుర్కొంటానని రాహుల్ పేర్కొన్నారు.