Actress Archana kavi: పెను ప్రమాదం నుంచి బయటపడ్డ ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’ నటి

  • అర్చన ప్రయాణిస్తున్న కారుపై ఊడిపడ్డ మెట్రోశ్లాబ్ పెళ్లలు
  • ధ్వంసమైన కారు
  • డ్రైవర్‌కు పరిహారం ఇవ్వాలంటూ అధికారులను కోరిన నటి
మలయాళ నటి అర్చన కవి పెను ప్రమాదం నుంచి త్రుటిలో ప్రాణాలు దక్కించుకుంది. కొచ్చిలో ఆమె ప్రయాణిస్తున్న కారుపై ఒక్కసారిగా మెట్రో శ్లాబ్ కాంక్రీట్ పెళ్లలు ఊడిపడ్డాయి. దీంతో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.  అయితే అదృష్టవశాత్తు కారులోని వారికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ప్రమాదం గురించి అర్చన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. పెను ప్రమాదం నుంచి రెప్పపాటులో తప్పించుకున్నట్టు పేర్కొంది. విమానాశ్రయానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని తెలిపింది. ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైందని, కారు డ్రైవర్‌కు పరిహారం ఇవ్వాలంటూ మెట్రో అధికారులు, పోలీసులను కోరింది. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, అర్చన తెలుగులో ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’ అనే సినిమాలో నటించింది.
Actress Archana kavi
kerala
kochi
Accident

More Telugu News