Rajinikanth: రజనీకాంత్ పై సుబ్రహ్మణ్యస్వామి ఘాటు వ్యాఖ్యలు

  • రజనీ నాటకాలు ఆడుతున్నారు
  • కొత్త పార్టీ ఏర్పాటుపై ఎలాంటి సూచనలు కనిపించడంలేదు
  • రాజకీయ ప్రవేశంపై ఎందుకు స్పష్టత ఇవ్వడంలేదు?
రాజకీయాల్లోకి వస్తానంటూ రజనీకాంత్ నాటకాలు ఆడుతున్నారంటూ బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి మండిపడ్డారు. మాటలు తప్ప రజనీకాంత్ లో చేతలు కనిపించడంలేదని, కొత్త పార్టీ పెట్టే విషయంలో ఎలాంటి స్పష్టతలేదని దుయ్యబట్టారు. బీజేపీ సిద్ధాంతాలు బాగున్నాయంటున్న రజనీకాంత్, తన రాజకీయ రంగప్రవేశంపై ఎందుకు స్పష్టత ఇవ్వలేకపోతున్నారని నిలదీశారు.

రజనీకాంత్ కొత్త పార్టీ పెడతారంటూ ఆయన సోదరుడు సత్యనారాయణరావు గతంలో వెల్లడించగా, అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతించారు. లోక్ సభ ఎన్నికలు ముగియగానే రజనీ పార్టీ ప్రకటన ఉంటుందని అందరూ భావించారు. కానీ, రజనీకాంత్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి.
Rajinikanth

More Telugu News