Cricket: ఒక్క బంతి పడకుండానే రద్దయిన పాకిస్థాన్-శ్రీలంక మ్యాచ్

  • ఇరు జట్లకు చెరో పాయింటు
  • బ్రిస్టల్ లో వరుణుడి హవా
  • ఎంతకీ తగ్గని వాన
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్థాన్, శ్రీలంక జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షార్పణం అయింది. ఈ మ్యాచ్ కు వేదిక అయిన బ్రిస్టల్ లో వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దాంతో, పాక్, లంక జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. కాగా, రేపు వరల్డ్ కప్ లో రెండు లీగ్ మ్యాచ్ లు జరగనున్నాయి. ఆతిథ్య ఇంగ్లాండ్, ఆసియా జట్టు బంగ్లాదేశ్ తో తలపడనుంది. మరోమ్యాచ్ లో న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు పోటీపడనున్నాయి.
Cricket

More Telugu News