relangi narasimha rao: నటనలో రమ్యకృష్ణ ఎంతో ఎదిగిపోయింది: రేలంగి నరసింహారావు

  • తొలినాళ్లలోనే రమ్యకృష్ణ నా సినిమాల్లో చేసింది
  •  'నరసింహా'లో ఆమె నటన అద్భుతం
  •  'బాహుబలి'తో రమ్యకృష్ణ కట్టిపడేసింది   
హాస్య కథా చిత్రాల దర్శకుడిగా .. కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా రేలంగి నరసింహారావుకి ఎంతో పేరుంది. అలాంటి ఆయన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రమ్యకృష్ణను గురించి ప్రస్తావించారు.

"రమ్యకృష్ణ కెరియర్ తొలినాళ్లలోనే ఆమెతో నేను 'భామా కలాపం' .. 'దాగుడు మూతల దాంపత్యం' వంటి సినిమాలు చేశాను. అప్పటికీ ఇప్పటికీ నటన పరంగా రమ్యకృష్ణ ఎంతో ఎదిగిపోయింది. నటన పరంగా అప్పటికీ ఇప్పటికీ ఆమెలో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. 'నరసింహా' సినిమాలో ఆమె అద్భుతంగా నటించింది. ఆ తరువాత అంతకన్నా ఎక్కువ పేరును 'బాహుబలి' సినిమాతో తెచ్చుకుంది. కెరియర్ తొలినాళ్లలోనే బాగా చేసేది .. ఆ తరువాత తనని తాను మలచుకుంటూ అలా ఎదిగిపోయింది. అందుకే రమ్యకృష్ణను చూస్తే ఆనందాశ్చర్యాలు కలుగుతాయి" అని చెప్పుకొచ్చారు. 
relangi narasimha rao

More Telugu News