జగన్ మంత్రి వర్గంలో బొత్స, సుచరిత, పెద్దిరెడ్డి, గౌతమ్ రెడ్డి?

  • రేపు కొలువు దీరనున్న కొత్త మంత్రి వర్గం
  • బొత్స , సుచరిత, పెద్దిరెడ్డి, గౌతమ్ రెడ్డి కి అవకాశం
  • ఇప్పటికే ఫోన్ కాల్స్ చేసిన విజయసాయిరెడ్డి
ఏపీలో 25 మంది కొత్త మంత్రులు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొలువు దీరనున్న కొత్త మంత్రి వర్గంలో ఎవరికి స్థానం దక్కనుందో అన్న విషయమై వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు ఆ పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యేలు బొత్స సత్యనారాయణ, సుచరిత, పెద్దిరెడ్డి, గౌతమ్ రెడ్డి, ధర్మాన కృష్ణదాస్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కి ఇప్పటికే వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి ఫోన్ కాల్స్ చేసినట్టు సమాచారం. కొత్త మంత్రి వర్గంలో వీరికి అవకాశం దక్కినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా నేతల నివాసాల వద్ద వారి అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా పీడిక రాజన్న దొరను నియమించే అవకాశాలున్నట్టు సమాచారం.
Go Back to Shorts
YSRCP
botsa
peddireddy
sucharita

More Telugu News