Andhra Pradesh: ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా తమ్మినేని సీతారాం?

  • ఆముదాలవలస వైసీపీ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం
  • ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని కలిసిన తమ్మినేని
  • గతంలో మంత్రిగా పని చేసిన అనుభవశాలి 
ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా తమ్మినేని సీతారాంను నియమిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని తమ్మినేని కలిసినట్టు తెలుస్తోంది. ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి తమ్మినేని గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తొమ్మిదేళ్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. కళింగ (బీసీ) సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి తమ్మినేని. కేబినెట్ లో బడుగు, బలహీనవర్గాలకు పెద్దపీట వేస్తానని జగన్ చెప్పడం తెలిసిందే. స్పీకర్ పదవిని కూడా ఆ వర్గాలకే కేటాయిస్తారనే ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో జగన్ ని తమ్మినేని కలవడం గమనార్హం.
Andhra Pradesh
tammineni
sitaram
speaker

More Telugu News