MS Dhoni: ధోనీ 'బలిదాన్' తీయవద్దు... ఐసీసీ మెడలు వంచుదాం... క్రికెట్ ఫ్యాన్స్ వేలాది కామెంట్లు!

  • వరల్డ్ కప్ ను బహిష్కరించి వచ్చేయండి
  • దేశంలో ఇంకో ఐపీఎల్ ఆడుకుందాం
  • లోగోను మాత్రం తీయవద్దంటున్న ఫ్యాన్స్
భారత క్రికెట్ జట్టు కీపర్ ఎంఎస్ ధోనీ గ్లౌజ్ పై ఉన్న 'బలిదాన్' లోగోను తీసేయాలని ఐసీసీ ఆదేశించడంపై క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ పై ఉండే మూడు సింహాల లోగోను గుర్తు చేస్తూ, ఆ దేశ సైనికుల త్యాగ చిహ్నాన్ని వాళ్లు ధరిస్తున్నారని అంటున్నారు. ధోనీ లోగోను తీసివేయరాదని, ఐసీసీకి వెళ్లే ఆదాయంలో 80 శాతాన్ని ఇస్తున్న భారత క్రికెట్ జట్టు, వరల్డ్ కప్ టోర్నీ నుంచి బయటకు వచ్చేసి బుద్ధి చెప్పాలని సలహాలు ఇస్తున్నారు.

టోర్నీ నుంచి స్వచ్ఛందంగా తప్పుకుని, ఇండియాలో మరో ఐపీఎల్ ఆడుకుందామని అంటున్నారు. ఈ లోగో తీసేస్తే, అసలు మ్యాచ్ లు చూడవద్దని ఒకరు, ఆటకన్నా దేశ గౌరవమే ముఖ్యమని మరికొందరు, ధోనీ గుండెల్లోంచి భారత సైన్యాన్ని తొలగించలేరని ఇంకొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. ఈ మేరకు 'ధోనీ కీప్ ది గ్లోవ్' పేరిట హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు తెగ ట్రెండింగ్ లో ఉంది.
MS Dhoni
Balidan
Logo
ICC
Cricket
Fans
#DhoniKeepTheGlove

More Telugu News