అందరిముందూ స్టేజ్ ఎక్కి.. అమెజాన్ చీఫ్ పై విరుచుకుపడ్డ ఇండో అమెరికన్ యువతి!
- 'రీ మార్స్' పేరిట ఏర్పాటైన చర్చా కార్యక్రమం
- జంతువులకు ఏదైనా చేయాలంటూ వేదికపైకి వచ్చిన ప్రియ
- బలవంతంగా తీసుకెళ్లిన సెక్యూరిటీ గార్డులు
దీంతో అప్పటిదాకా చలోక్తులు, నవ్వులతో సాగిన చర్చ, సీరియస్ గా మారగా, ఆడిటోరియం సైతం నిశ్శబ్దంగా మారింది. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది వేదికపైకి వచ్చి, ప్రియను కిందకు తీసుకెళ్లారు. ఆపై జెఫ్ బెజోస్ వాతావరణాన్ని తేలికపరుస్తూ, చర్చ సంధానకర్తతో "ఆమె ప్రశ్నకు మీ వద్ద సమాధానం ఉందా?" అని అడిగారు. కాగా, ఆమెను అరెస్ట్ చేశారా? లేదా? అన్న విషయంలో లాస్ వెగాస్ పోలీసులు స్పష్టత ఇవ్వలేదు.