Vishnu: గుత్తా జ్వాలతో స్నేహం తదుపరి దశకు వెళుతుందా? అంటే చెప్పలేను!: 'రాక్షసన్' హీరో విష్ణు

  • ఏడాదిన్నరగా పరిచయం ఉంది
  • కలిసి టైమ్ పాస్ చేస్తుంటాం
  • అంతకుమించి ఏమీ లేదన్న విష్ణు
ప్రస్తుతానికి బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల తాను మంచి స్నేహితులం మాత్రమేనని, ఈ స్నేహం తదుపరి దశకు వెళ్తుందా? అని తనను అడిగితే సమాధానం చెప్పలేనని 'రాక్షసన్'తో విజయాన్ని అందుకున్న హీరో విష్ణు వ్యాఖ్యానించాడు. దాదాపు ఏడాదిన్నరగా ఆమె తనకు తెలుసునని, ఇద్దరికీ కామన్ గా ఉన్న స్నేహితులతో కలిసి టైమ్ పాస్ చేస్తుంటామని అన్నాడు. ప్రస్తుతం ఇద్దరమూ ఎవరి పనుల్లో వాళ్లం బిజీగా ఉన్నట్టు చెప్పాడు.

 కాగా, విష్ణు తన భార్య నుంచి గత సంవత్సరం విడిపోయాడు. ఇటీవల గుత్తా జ్వాలతో సన్నిహితంగా తీసుకున్న సెల్ఫీలను విష్ణు, తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో, అవి వైరల్ అయ్యాయి. వీరిద్దరి మధ్య గాఢమైన ప్రేమ ఉందన్న వార్తలు గుప్పుమన్నాయి. విష్ణు ప్రస్తుతం 'జగజ్జాల కిలాడి' అనే చిత్రంలో నటిస్తున్నాడు.
Vishnu
Gutta Jwala
Lover
Frind

More Telugu News