Andhra Pradesh: ఏపీ మంత్రివర్గ ప్రమాణానికి ముహూర్తం ఖరారు!

  • రేపు ఉదయం 11.49 గంటలకు కార్యక్రమం
  • సచివాలయం ప్రాంగణంలోనే కార్యక్రమం
  • పూర్తిస్థాయిలో ఏర్పాటుకానున్న మంత్రివర్గం
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం ఖరారైంది. రేపు ఉదయం 11.49 గంటలకు ఈ కార్యక్రమం ఉంటుంది. సచివాలయం ప్రాంగణంలోనే కాబోయే మంత్రులతో గవర్నర్ ప్రమాణం చేయించనున్నారు. ఒకేసారి పూర్తిస్థాయిలో 25 మంది మంత్రులను జగన్ ఇప్పటికే ఎన్నుకున్నారని తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం పదవులు దక్కవచ్చని సమాచారం.

కాగా, నేడు వైకాపా శాసనసభాపక్ష సమావేశం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్న సీఎం జగన్, పార్టీలో తీసుకురావాల్సిన మార్పులు, మంత్రివర్గం కూర్పుపై స్పష్టత ఇవ్వనున్నారు. ఎవరెవరికి ఏ కారణంతో మంత్రి పదవులు ఇవ్వాల్సి వచ్చిందన్న విషయంలోనూ నేతలకు జగన్ వివరిస్తారని తెలుస్తోంది.
Andhra Pradesh
Cabinet
Oath
Jagan

More Telugu News