Chiranjeevi: మళ్లీ వివాహం చేసుకున్నశిరీష్ భరద్వాజ్

  • హైదరాబాద్ కు చెందిన డాక్టర్ తో వివాహం
  • ఈ పెళ్లి మూడు నెలల కిందట జరిగిందట
  • సామాజిక మాధ్యమాల్లో శిరీష్-విహన ఫొటోలు
ప్రముఖ సినీ నటుడు చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ రెండో పెళ్లి చేసుకున్నాడు. హైదరాబాద్ కు చెందిన డాక్టర్ విహనతో భరద్వాజ్ వివాహం జరిగింది. అయితే, వీరి వివాహం మూడు నెలల కిందట జరిగినట్టు సమాచారం. శిరీష్ భరద్వాజ్-విహనలు కలిసి దిగిన ఫొటోలు కొన్ని నెలలుగా సామాజిక మాధ్యమాల్లో కనిపించాయి. ఆమెను శిరీష్ భరద్వాజ్ పెళ్లి చేసుకుంటున్నాడన్న వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమయ్యాయి. కాగా, 2014లో చట్టబద్ధంగా శ్రీజతో శిరీష్ విడిపోయాడు. శ్రీజ-శిరీష్ ల వైవాహిక జీవితానికి గుర్తుగా ఓ పాప పుట్టింది. వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్న తర్వాత శ్రీజ దగ్గరే ఆ పాప పెరుగుతోంది.  
Chiranjeevi
srija
bhardwaj
second marriage

More Telugu News