Andhra Pradesh: ఊరికొకటి చొప్పున విలాసవంతమైన భవనాలు ఎవరికి ఉన్నాయో అందరికీ తెలుసు!: విజయసాయిరెడ్డికి యనమల కౌంటర్

  • ప్రజావేదిక కేటాయించాలని సీఎంకు చంద్రబాబు లేఖ
  • విమర్శలు గుప్పించిన విజయసాయిరెడ్డి
  • వాటిని తిప్పికొట్టిన టీడీపీ నేత యనమల
టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ కు రాసిన లేఖపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ మాజీ ఆర్థిక మంత్రి, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు తీవ్రంగా స్పందించారు. విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఉండవల్లిలోని ప్రజావేదికను తనకు కేటాయించాలని చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ కు రాసిన లేఖ మొదటిది కాదని యనమల స్పష్టం చేశారు. సమగ్రాభివృద్ధి, పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని గతంలోనే చంద్రబాబు సీఎం జగన్ కు లేఖ రాశారని తేల్చిచెప్పారు. అధికారంలోకి వచ్చినా, వైసీపీ నేతలు అబద్ధాలు చెప్పడం మాత్రం మానలేదని చురకలు అంటించారు. విలాసవంతమైన భవనాలు ఊరికి ఒకటి చొప్పున ఎవరికి ఉన్నాయో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు.
Andhra Pradesh
Yanamala
Telugudesam
Chandrababu
YSRCP
Jagan
Vijay Sai Reddy

More Telugu News