Andhra Pradesh: రాబోయే ఎన్నికల్లో ఇక పోటీ చేయను.. భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ప్రకటన

  • జగన్ అద్భుతంగా పనిచేస్తున్నారు
  • తిరుపతి ఎమ్మెల్యే హోదా మంత్రి పదవి కంటే గొప్పది
  • తిరుపతిలో మీడియాతో మాట్లాడిన వైసీపీ నేత
తిరుపతిలో టీడీపీ అభ్యర్థిపై గెలవడం చిన్న విషయం కాదని వైసీపీ నేత, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతికి ప్రాతినిధ్యం వహించడం మంత్రి పదవి కంటే గొప్ప విషయమని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తన గెలుపునకు కృషి చేసిన ప్రతీఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు. తిరుపతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో భూమన మాట్లాడారు.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీచేయబోనని భూమన కరుణాకర్ రెడ్డి బాంబు పేల్చారు. ఏపీలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్ పనిచేస్తున్నారని ప్రశంసించారు. అయితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించడానికి గల కారణాన్ని మాత్రం భూమన స్పష్టం చేయలేదు. దీంతో మంత్రి పదవి ఇవ్వలేకపోతున్నామని అధిష్ఠానం నుంచి స్పష్టమైన సూచనలు వచ్చిన నేపథ్యంలోనే ఆయన కలత చెందినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
Andhra Pradesh
Jagan
YSRCP
bhumana
Tirupati
mla
not contesting

More Telugu News