Andhra Pradesh: సీఎం జగన్ కు తొలిసారి నిరసన సెగ.. ఇంటి ముందు ఏఎన్ఎం, డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన!
- నేడు సమీక్ష నిర్వహిస్తున్న జగన్
- తమకు న్యాయం చేయాలంటున్న బాధితులు
- పట్టించుకోని క్యాంపు కార్యాలయం అధికారులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు తొలిసారి నిరసనల సెగ తగిలింది. ఈరోజు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వ్యవసాయం, దాని అనుబంధ శాఖలపై సీఎం జగన్ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2018 డీఎస్సీ అభ్యర్థులు, ఏఎన్ఎంలు ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీసు ముందు ఆందోళనకు దిగారు.
తమకు వెంటనే ఉద్యోగాలు కల్పించాలనీ, వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో తమకు అన్యాయం జరిగిందని వాపోయారు. కొత్త ప్రభుత్వమయినా తమకు న్యాయం చేయాలని కోరారు. వీరి ఆందోళనను క్యాంపు ఆఫీసు అధికారులెవరూ పట్టించుకోలేదు. ఆందోళనకారులు క్యాంపు కార్యాలయం ప్రాంగణంలోకి చొచ్చుకురాకుండా కట్టుదిట్టమైన భద్రతాఏర్పాట్లు చేశారు.