Andhra Pradesh: ఇలాంటి అభిమానులు, మద్దతుదారులు ఉండటం నిజంగా నా అదృష్టం!: గంటా శ్రీనివాసరావు

  • గంటా విజయంపై మొక్కుకున్న సూర్యనారాయణ
  • మొక్కు తీర్చుకునేందుకు కాలినడకన సింహాచలానికి
  • ట్విట్టర్ లో స్పందించిన ఏపీ మాజీ మంత్రి
ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి టీడీపీ నేత, ఏపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గంటా విజయం సాధించాలని మొక్కుకున్న అభిమాని చీపురుపల్లి సూర్యనారాయణ మొక్కు తీర్చుకునేందుకు కాలినడకన సింహాచలం బయలుదేరారు. ఈ విషయం తెలుసుకున్న గంటా సంతోషం వ్యక్తం చేశారు.

సూర్యనారాయణ నుంచి ఇలాంటి ప్రేమాభిమానాలు పొందిన తాను నిజంగా అదృష్టవంతుడిని అని గంటా వ్యాఖ్యానించారు. తాను ఎన్నికల్లో విజయం సాధించాలనీ, గెలిస్తే సింహాచలం వరకూ కాలినడకన వస్తానని సూర్యనారాయణ మొక్కుకున్నారని చెప్పారు. ఇలాంటి అభిమానులు, మద్దతుదారుల ప్రేమను పొందుతున్న తాను నిజంగానే అదృష్టవంతుడిని అని పునరుద్ఘాటించారు. ఈ మేరకు గంటా శ్రీనివాసరావు ట్వీట్ చేశారు.
Andhra Pradesh
Ganta Srinivasa Rao
Telugudesam
simhachalam
Twitter
fan and supporters

More Telugu News