Kurnool District: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి దుర్మరణం

షార్ట్స్‌లో చూడండి
కర్నూలు జిల్లాలో ఈరోజు తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు, తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన ఐదుగురు సభ్యులు కారులో తిరుగు ప్రయాణ అయ్యారు. వీరి కారు ఓర్వకల్లు సమీపంలోకి వచ్చేసరికి ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సాయిబాబాశర్మ, సతీష్ కుమార్ లు అక్కడికక్కడే చనిపోయారు. కారులోని మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు ఎక్కడివారు అన్నది తెలియరావాల్సి ఉంది.
Go Back to Shorts
Kurnool District
orvakallu
Road Accident
two died

More Telugu News