చంద్రబాబు ఓడిపోవాలన్న నా కోరిక తీరింది... తిరుమల మొక్కు తీర్చుకున్నా: మోత్కుపల్లి

షార్ట్స్‌లో చూడండి
చంద్రబాబునాయుడి పరాజయంతో తనకెంతో ఆనందం కలుగుతోందని తెలుగుదేశం పార్టీ మాజీ నేత మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం తిరుమలకు వచ్చి స్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవాలని కోరుకుంటూ, కాలినడకన తిరుమలకు వస్తూ, మెట్టుమెట్టుకూ తాను మొక్కుకున్నానని, ఇప్పుడా మొక్కును తీర్చుకునేందుకు వచ్చానని అన్నారు.

నమ్మినవారిని నట్టేట ముంచే చంద్రబాబు, రాజ్యసభ సీట్లను రూ. 100 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. ఒక ఎస్సీకిగానీ, బీసీకిగానీ ఒక్క పదవి కూడా ఇవ్వలేదని అన్నారు. చంద్రబాబును తెలంగాణ నుంచి ప్రజలు ఎన్నడో తరిమేశారని, ఇప్పుడు ఏపీలోనూ అదే జరిగిందని మోత్కుపల్లి ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ఇక రాజకీయ భవిష్యత్తు ఉండదని అన్నారు. రాష్ట్రాన్ని సమర్థవంతంగా పాలించేలా ఆ భగవంతుడు జగన్ కు శక్తి సామర్థ్యాలను, ఆయురారోగ్యాలను ఇవ్వాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
Go Back to Shorts
Chandrababu
Motkupalli
Tirumala

More Telugu News