YSRCP: సోషల్ మీడియా యోధులకు కృతజ్ఞతలు: వైఎస్ జగన్

  • ఎన్నికల్లో విజయం వెనుక సోషల్ మీడియా
  • ఎంతగా శ్రమించారో నాకు తెలుసు
  • ఇకపై కూడా మద్దతివ్వాలని కోరిన జగన్
తాను అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం వెనుక సోషల్ మీడియా పాత్ర ఎంతైనా ఉందని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా యోధులు ఎంతో మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతగా శ్రమించారో తనకు తెలుసునని అన్నారు. వీరంతా ఎల్లో మీడియాకు వ్యతిరేకంగా పోరాడారని, వైసీపీ విజయంలో వీరు కూడా కీలకమేనని అన్నారు. వీరందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, ఇప్పటి వరకూ ఇచ్చిన మద్దుతునే ఇకపైనా కొనసాగించాలని కోరుకుంటున్నానని చెబుతూ, తన ట్విట్టర్ ఖాతాలో జగన్ ఓ ట్వీట్ పెట్టారు. 
YSRCP
Jagan
Social Media

More Telugu News