Anushka Shetty: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • రీమేక్ లో నటించనున్న అనుష్క 
  • మరో రెండు సినిమాలలో వెంకటేశ్
  • రవితేజతో జతకడుతున్న శ్రుతి
*  ప్రస్తుతం 'సైలెంట్' చిత్రంలో నటిస్తున్న అందాలతార అనుష్క త్వరలో మరో చిత్రం చేయనుంది. 'జూలియాస్ ఐస్' అనే స్పానిష్ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో దర్శకుడు కబీర్ లాల్ రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇందులో కథానాయిక పాత్రకు అనుష్కను తీసుకుంటున్నారట.
*  ప్రస్తుతం 'వెంకీమామ' చిత్రంలో నటిస్తున్న సీనియర్ హీరో వెంకటేశ్ మరో రెండు చిత్రాలను లైన్లో పెట్టారు. వీటిలో ఒకటి 'నేను లోకల్' ఫేం త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతుంది. మరొక చిత్రానికి తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తాడు.
*  గతంలో 'బలుపు' చిత్రంలో జంటగా నటించిన రవితేజ, శ్రుతి హాసన్ మరోసారి జోడీ కడుతున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందే చిత్రంలో కథానాయిక పాత్ర కోసం శ్రుతిహాసన్ తో సంప్రదింపులు జరుగుతున్నాయి.   
Anushka Shetty
Venkatesh
Raviteja
Shruti Hassan

More Telugu News