Chandrababu: చంద్రబాబు విదేశీ పర్యటన రద్దు!

  • ఈనెల 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు
  • కేశినేని నాని వ్యవహారంతో చంద్రబాబు అప్రమత్తం
  • పార్టీ వ్యవహారాలపై దృష్టి
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల ఫలితాల అనంతరం కుటుంబంతో విదేశీ యాత్రకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 7న టూర్ వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్న దశలో ఆయన విహార యాత్ర రద్దయింది. అందుకు కారణం, త్వరలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండడమే అని తెలుస్తోంది. ఈ నెల 12 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. మరోవైపు, కేశినేని నాని అంశం పార్టీలో విభేదాలను తేటతెల్లం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో విహారయాత్రకు వెళ్లడం సబబుకాదని చంద్రబాబు భావించినట్టు సమాచారం. శాసనసభ సమావేశాల కోసం పార్టీని సన్నద్ధం చేయడంపై ఆయన దృష్టి సారించనున్నారు.
Chandrababu

More Telugu News