Kesineni Nani: కేశినేని నాని అసంతృప్తి వెనుక మాజీ మంత్రి దేవినేని ఉమ?

  • విజయవాడలో పార్టీ ఆఫీసు బాధ్యతలు కేశినేనికి
  • అంతలోనే రంగప్రవేశం చేసిన మాజీ మంత్రి దేవినేని
  • అసంతృప్తితో విప్ పదవిని తిరస్కరించిన నాని
టీడీపీ అధిష్ఠానంపై విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని అలిగిన సంగతి తెలిసిందే. లోక్ సభలో టీడీపీ విప్ పదవిని ఆయన ఈరోజు తిరస్కరించారు. ఈ పదవికి తాను అర్హుడిని కాదనీ, మరొకరికి అప్పగించాలని టీడీపీ అధినేత చంద్రబాబును కోరారు. అయితే కేశినేని నాని అలక వెనుక మరో టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం అందరికీ అందుబాటులో ఉండేలా విజయవాడలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించాలని పలువురు టీడీపీ నేతలు చంద్రబాబును కోరారు. దీంతో ఈ బాధ్యతలను టీడీపీ అధినేత కేశినేని నానికి అప్పగించారు. అయితే మధ్యలో ఏమయిందో తెలియదు కానీ, పార్టీ కార్యాలయం ఏర్పాటు బాధ్యతలు మంత్రి దేవినేని ఉమకు ఇచ్చారు.

దీంతో తనకు ఇచ్చిన బాధ్యతలను కనీసం చెప్పాపెట్టకుండా పార్టీ అధిష్ఠానం మరొకరికి అప్పగించడంపై నాని కలత చెందినట్లు సమాచారం. అందువల్లే లోక్ సభలో టీడీపీ విప్ పదవిని సైతం కేశినేని నాని తిరస్కరించారని తెలుస్తోంది.
Kesineni Nani
Telugudesam
Andhra Pradesh
DEVINENI UMA

More Telugu News