Andhra Pradesh: ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాసిన టీడీపీ అధినేత చంద్రబాబు!

షార్ట్స్‌లో చూడండి

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. అమరావతిలోని ప్రజావేదికను ప్రతిపక్ష నేత అయిన తనకు కేటాయించాలని లేఖలో కోరారు. తన నివాసానికి అనుబంధంగా ప్రజావేదికను కేటాయించాలని అందులో విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు తాను ఉన్న నివాసంలోనే కొనసాగాలని అనుకుంటున్నట్లు చెప్పారు.

ప్రస్తుతం ఉంటున్న ఇంటిని యాజమాన్యం షరతుల మేరకు వినియోగించుకుంటానని చంద్రబాబు తెలిపారు. తనను కలుసుకునేందుకు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, ప్రజలు వస్తుంటారనీ, కాబట్టి పక్కనే ఉన్న ప్రజావేదికను అధికారిక కార్యక్రమాల కోసం వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని లేఖలో కోరారు.  
Go Back to Shorts
Andhra Pradesh
Chandrababu
Telugudesam
Chief Minister
Jagan
YSRCP
letter

More Telugu News