Andhra Pradesh: సయోధ్య కోసం రంగంలోకి గల్లా జయదేవ్.. విజయవాడలో కేశినేని నానితో భేటీ!

  • టీడీపీలో ప్రాధాన్యతపై నాని అలక
  • లోక్ సభ విప్ పదవి తిరస్కరణ
  • ఎంపీగానే పోరాడుతానని స్పష్టీకరణ

లోక్ సభలో టీడీపీ విప్ పదవిని విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని నాని పైకి చెప్పినప్పటికీ పార్టీ అధిష్ఠానం తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం పట్ల ఆయన అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గుంటూరు లోక్ సభ సభ్యుడు, టీడీపీ నేత గల్లా జయదేవ్ రంగంలోకి దిగారు. ఈరోజు విజయవాడకు చేరుకున్న ఆయన కేశినేని నానితో మాట్లాడారు.

పార్టీపై అలక వహించడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కాగా, ఈ విషయమై కేశినేని నాని స్పందిస్తూ.. టీడీపీ విప్ తిరస్కరణ అంశాన్ని పెద్దదిగా చేసి చూపించవద్దని మీడియాను కోరారు. తాను విజయవాడ లోక్ సభ సభ్యుడిగానే లోక్ సభలో అవిశ్వాస తీర్మానం పెట్టానని గుర్తుచేశారు. పోరాడేందుకు పదవులు అవసరం లేదని స్పష్టం చేశారు. ఫేస్ బుక్ లో తన వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పుకునే స్వేచ్ఛ ఉందని వ్యాఖ్యానించారు.

More Telugu News