USA: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు షాక్.. పరువుతీసేలా బొమ్మను ఏర్పాటుచేసిన బ్రిటిషర్లు!

  • ట్రంప్ పర్యటనను నిరసిస్తున్న బ్రిటిషర్లు
  • రాకను వ్యతిరేకిస్తూ లండన్ లో బొమ్మ ఏర్పాటు
  • అక్కడ ట్రంప్ కు వ్యతిరేకంగా నినాదాలు
దుందుడుకు వ్యాఖ్యలకు మారుపేరైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు మిత్రుల కంటే శత్రువులు ఎక్కువయ్యారు. వలసల విషయంలో ట్రంప్ నిర్ణయాలు, చర్యలపై వారంతా నిరసనలు తెలియజేస్తున్నారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బ్రిటన్ పర్యటనకు వ్యతిరేకంగా బ్రిటిషర్లు వినూత్నంగా నిరసన తెలిపారు.

చేతిలో స్మార్ట్ ఫోన్ తో టాయిలెట్ పై ట్రంప్ కూర్చున్నట్లు ఉన్న పెద్ద బొమ్మను లండన్ నగరంలో ఏర్పాటుచేశారు. దాని తలపై అమర్చిన టోపీపై ‘అమెరికాను మళ్లీ గొప్పగా చేద్దామా? నన్ను పదవీచ్యుతుడిని చేయండి’ అని రాశారు. త్రాఫాల్గర్ స్క్వేర్ వద్ద ఏర్పాటు చేసిన ఈ బొమ్మ వద్ద భారీగా గుమిగూడిన ప్రజలు ట్రంప్ రాకకు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు.
USA
Donald Trump
uk tour
statue

More Telugu News